![]() |
![]() |
.webp)
ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ వేణు స్వామి అంటే ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఇండస్ట్రీలో ఉండే హీరోలు, హీరోయిన్లు ఎవరెవరు ఎప్పుడు విడిపోతారు, ఎవరెవరికి ఎలా కలిసొస్తుంది అంటూ చెప్పే ఆస్ట్రాలజర్ బాబా ఈ వేణు స్వామి. అలాంటి వేణుస్వామి దగ్గర రీసెంట్ గా ఇనాయ సుల్తానా పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే. వేణు స్వామి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఆయనతో కలిసున్న పిక్స్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ కామెంట్స్ ఐతే మాములుగా లేవు. "ఓకే మా ఇప్పటి నుంచి నీకు చూడు కెజిఎఫ్- 3 లో హీరోయిన్ గా, సాలార్ - 3 లో హీరోయిన్ గా, ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ లో మీరే వెలిగిపోతారు...మా స్వామి మహత్యం అది... చదువుకున్నారు.. కొంచెమైనా ఇంగితం, మెచ్యూరిటీ, సోయ లేకుండా ఏంటండీ ఇలాంటి వెధవల్ని పెంచిపోషిస్తున్నారు..మీలాంటి వాళ్ళ వల్లే అలాంటివాళ్ళు పేట్రేగిపోతున్నారు..ప్రజల మూఢనమ్మకాలతో ఆడుకుంటూ, కష్టపడకుండానే ఆర్థికంగా పైకి ఎదుగుతున్నారు...డైరెక్ట్ కేటిఆర్ సీఎం అంటివి గురూజీ..ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. ఈయన చెప్పేవి ఏమి జరగవు ...అయినా నీలాంటి అమాయకులు ఎందుకు ఇంకా వెళతారో అర్ధం కాదు...ఫేమస్ అవ్వడానికి పూజ చేయించుకుంటున్నావా ? అది పబ్లిసిటీ స్టంట్ ఆ లేదంటే రియల్ గా అలా పూజలు చేయాలనిపించింది ?" అంటూ వేణు స్వామిని పనిలో పనిగా బిగ్ బాస్ బ్యూటీ ఇనాయాని కూడా తిట్టేసారు. వేణుస్వామి కొంతకాలంగా సెలెబ్రిటీలకు జ్యోతిష్యం చెప్తూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాడు. రష్మిక మందన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి లాంటి హీరోయిన్లు లక్షలు ఖర్చు పెట్టి ఆయనతో పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఆయన జోస్యం ఫెయిల్ ఐన సమయాల్లో నెటిజన్స్ ఆయన్ని ఫుల్ గా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఐనా అవన్నీ పట్టించుకోకుండా..తన పని చేసుకుపోతుంటాడు వేణు స్వామి.
![]() |
![]() |